చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
చలికాలంలో వచ్చిందంటే చాలు మంచు దుప్పటిలా పరిచేస్తుంది. అలాగే కొంచే బాధకము కూడా వస్తుంది. ప్రకృతి కూడా రమణీయంగా అనిపిస్తుంది. ఈ చలి అనుభూతి ఎలా ఉన్నా.. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన కూడా పడాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఏ మాత్రం ఆరోగ్యంపై అదమరిచి ఉన్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చర్మ సమస్యలు, కీ హైడ్రేషన్, చుండ్రు, జలుబు, ఆస్ధమా లాంటి సమస్యలు పెరుగుతుంటాయి. ఎక్కువగా చలిలో తిరగడం ప్ర్రమాదంగా ఉంటుంది. మరి చలికాలంలో వచ్చే వ్యాధులను ధురంగా ఉందటం.. చలి తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం....
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...
ఏ కాలంలో చాలమంది జలుబు చేస్తుంది. కాబట్టి చలిలో ఎక్కువగా తిరగకుండా ఉందాలి.ప్రతిరోజూ గోరువెచ్చని నీటినే తాగితే జ్వరం, జలుబు, గొంతు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటుంది.
ముఖ్యంగా చిన్న పిల్లలకు జలుబుతో ముక్కు మనుకునిపోయి శ్వాస ఇబ్బందిగా వుంటే రంధ్రల్లో నాజర్ డ్రాప్స్ గాని, ఉప్పునీటి చుక్కలు వేయాలి.
ఈ కాలంలో చాలా మందికి పెదాలు పగిలిపోతూ ఉంటాయి. గ్లిజరిన్ కలిగిన వెన్న, కొబ్బరి నూనే రాత్రి పడుకునే ముందు రాసుకుంటే ఫలితం ఉంటుంది.
ఇంట్లో నుంచి చలిలో బయటకు వెళ్లే ముందు స్వేటర్, మఫ్లర్ , ధరించడం చాలా వరకు ఉత్తమం. వేడి ఆహారన్నే ప్రతి రోజూ తీసుకోవాలి.
నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, పుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది చల్లటి నీటికి బదులు ప్రతి రోజూ గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
ఆస్తమా సమస్య ఉన్నవారు శీతల వస్తువులకు పూర్తిగా దూరంగా ఉండాలి. మంచు కారణంగా కొన్నిసార్లు వాహానాలు కనిపించవు.
అలాంటి సమయంలో వాటికి రేడియం స్టిక్కర్లు అంటించుకోవడం వల్ల ప్రమాదాలు నివారంచవచ్చు.
బయటకు వెళితే తలకు ఖచ్చితంగా టోపి ధరించాలి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా భాగం తలలో నుంచే బయటకు వెళ్తుంది. కాబట్టి. శరీరాన్ని పూర్తిగా అప్పేసే దుస్తులను ఎక్కువగా వేసుకోవాలి.
బీపీ, గుండే సంబంధిత సమస్యలు ఉన్నవారు. ఏ కొంచెం మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సప్రధించండి.
No comments:
Post a Comment