గుడ్డు తింటే బరువు తగ్గుతారా?? లేదా పెరుగుతారా ?? - blog

Friday 3 January 2020

గుడ్డు తింటే బరువు తగ్గుతారా?? లేదా పెరుగుతారా ??

 గుడ్డు తింటే బరువు తగ్గుతారా?? లేదా పెరుగుతారా ??



ఉడి కించిన కోడిగుడ్లు రోజు వారి ఆహారంలో క్రమం తప్పకుండా రెండు తీసుకుంటే బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక క్రమ పద్దతిలో ఉడికించిన కోడిగుడ్డు ను  రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల  రెండు వారాలకు 24 పాండ్ల బరువును తగ్గించకోవచ్చు. మన దేశంలో ఇప్పుడున్న ఆరోగ్య సమస్య ఊబకాయం . ఊబకాయం వల్ల హృదయ సంబంధ  వ్యాధులు, మధుమేహం మరియు అనేక రకాల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది బరువు తగ్గిడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. క్యాలరీలను తగ్గించకుండా బరువు అనేది దాదాపు అసాధ్యం. బరువు అదుపులో ఉంచడం కోసం చేసే ఆహారం నియంతృణ లో ముఖ్యమైనది శరీరానికి అవసరమైన పోషకాలను మాత్రమే అందించాలి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే  మీరు తాజా కూరగాయలు మరియు పండ్లు, ధాన్యాలు, మరియు బీన్స్ తినాలి. కానీ కేలరీల తగ్గించడానికి, అధిక కేలరీల డేజార్ట్ లు , ఫాస్ట్ ఫుడ్, ఫిజా, డ్రింక్స్ మరియు స్వీట్స్ తగ్గించండి.
మన శరీరంలో శక్తి కోసం చాలా కేలరీలు అవసరమని మానందరికి తెలుసు. కొంతకాలం పోషకాలను తీసుకోవడం తగిస్తే మన శరీరానికి  హాని కలిగించవచ్చు , జీవక్రియ బలహీనపరుస్తుంది మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది. గుడ్లు ప్రోటీన్ మరియు  అనేక ఫోషకాలు కలిగి ఉన్నందున ఆరోగ్యకరమైన ఆహారం, గుడ్లు మన శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు  అందిస్తాయి .
గుడ్లు లో vitamin A , D, E  , K  అలాగే  B 6  మరియు vitamin B 12  పుష్కలంగా ఉనాయి. ఇందులో ఫోలెట్, విటమిన్ E పొటాషియం, కాల్షియం, మాంగనీస్, జింక్ మరియు ఐరన్  వంటి ఖనిజాలు మరియు విటమిన్లు కూడా ఉన్నాయి. ఒక పెద్ద గుడ్డులో చిన్న మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ఐదు  గ్రాముల కొవ్వు, ఆరు గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ మరియు 77 కేలరీలు ఉంటాయి. ఆరోగ్యాన్నిచ్చే పొటాషియం పచ్చసొనలో ఉంటాయి. తెల్ల సోనా లో ప్రోటీన్ మాత్రమే దొరుకుతుంది.  

No comments:

Post a Comment