ఉదయాన్నే వెల్లుల్లి, తేనె కలిపి తింటే ఎన్ని లాభాలో చూడండి.. - blog

Thursday 9 January 2020

ఉదయాన్నే వెల్లుల్లి, తేనె కలిపి తింటే ఎన్ని లాభాలో చూడండి..

 ఉదయాన్నే వెల్లుల్లి, తేనె కలిపి తింటే ఎన్ని లాభాలో చూడండి....

ఆరోగ్యానికి వెల్లుల్లి మంచిది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కూడా. అదే విధంగా తేనె కూడా... శరీరానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందుల్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే చాలా మంది టీ , కాఫీలు తీసుకుంటారు. అయితే, వాటికంటే  ముందుగా ఈ తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు..

జీర్ణ సమస్యలు దూరం..
 వెల్లుల్లి, తేనె కాంబినేషన్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. వెల్లుల్లి ఉదయాన్నే తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు దూరం అవుతాయని తెలుసు. దీనితో పాటు తేనె కూడా చాలా వరకూ జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల డయేరియా, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. పెద్ద పేగులో ఏర్పడే ఇన్ఫెక్షన్స్  ఈ మిశ్రమం దూరం చేస్తుంది. దీంతో పాటు శరీరంలో అవయువాల పనితీరు మెరుగుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.
ఎలా తీసుకోవాలి...

నిత్యం మనం వెల్లుల్లి వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు.  ఈ రెండింటలో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉదయాన్నే పరగదుపున తీసుకుంటే మంచిది.. దీన్ని ఎలా  తయారు చెయాలంటే .. ముందుగా రెండు, మూడు వెల్లుల్లిని తీసుకుని బాగా నలపాలి.. దీని వల్ల పోషకాలు రెట్టింపు అవుతాయి కొన్ని నిమిషాలు తర్వాత అందులో తేనె కలిపి పడగడుపున్నే తీసుకోవాలి..
అందం కూడా ...
ఇందులో అధికంగా యాంటీ యాక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి.. ఇవి చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి.. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. ఎంతో యవ్వనంగా మెరుస్తుంది. దీనితో పాటు చర్మంపై ముడతలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు.. నిజానికి తేనేని పైపూతగా చర్మానికి పూస్తారు.. దీని వల్ల మేను మెరుస్తుంది...

No comments:

Post a Comment