గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా ..? కదా..?.
గ్రీన్ టీ ట్రాగండి ఆరోగ్యానికి ఎంతో మంచిదని కొందరు వైద్యులు సలహాలు ఇస్తారు. మరో కొందరు అసలు గ్రీన్ టీ త్రాగడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అసలు తీసుకోవద్దని. మరికొందరు సలహాలు ఇస్తారు. అసలు గ్రీన్ టీ త్రాగడం మంచిదా కాదా అనే సందిగ్ధతలో ఎంతో మంది ఉండిపోతున్నారు. మరి గ్రీన్ టీ త్రాగడం మంచిదా..? కాదా..? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్రీన్ టీ ఎండిన తేయాకులుతో తయారు చేసేదే గ్రీన్ టీ . దీనిని కామెల్లియా సినేన్సిస్ గా పిలుస్తారు.గ్రీన్ టీ అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినా దీనికి ఎన్నో ఏళ్ళ ఘన చరిత్ర ఉండి. ఈ గ్రీన్ టీ వినియోగం కొన్ని వేల ఏళ్ళ క్రితం చైనా లోని రాజవంశీయులు వాడేవారని అప్పటి నుంచి ఇది వ్యాప్తి చెందుతూ, ఎన్నో పరిశోధనలు చేస్తూ ఆయుర్వేధ వైధ్యులు సైతం ఈ గ్రీన్ టీ వాడకంపై ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
క్యాన్సర్ రాకుండా ముందస్తుగా కాపాడటంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ గ్రీన్ టీ ఎంతో వేగంగా పనిచేస్తుంది. అంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సంస్ధ ఎన్నో వ్యాసాలు గ్రీన్ టీ విషయంలో ప్రచురించి. క్యాన్సర్ ఉన్న వాళ్ళు గ్రీన్ టీ త్రాగడం వలన వ్యాధిని నివారించుకోవచ్చన్ని వెల్లడించింది. అంతేకాదు స్వచ్చమైన ముఖ తేజస్సు కోసం, బరువు తగ్గడం కోసం , జుట్టు ధృడంగా మారడం కోసం గ్రీన్ టీ ఎంతొగానో ఉపయోగపడుతుందని వైద్యు నిప్పుణులు, పరిశోధకులు తెలుతున్నారు.
No comments:
Post a Comment