గుండె ఆరోగ్యరహస్యాలు - blog

Monday, 16 December 2019

గుండె ఆరోగ్యరహస్యాలు

గుండె ఆరోగ్యరహస్యాలు 

మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం అలవాట్లు మార్చుకోవాలి. మన జీవనశైలినిమార్చుకోవాలి . అవెంటో చుద్దాం.


ముఖంగా మన జీవితంలో ఉండే ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

ముఖంగా యోగా చేయాలి అలాగే షుగర్ B.P  ను కంట్రోల్ ఉండాలి. కొలస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

సోయా గుండెకి ఆరోగ్యకరమైన భోజనం. అలాగే క్యారెట్లు , చిలకడదుంపలు , ఎర్రమిరియాలు, టమోటాలు  మరియు నారింజ కూరగాయలో మన గుండెకు సహాయపడే కెరోటినాయిడ్లు, ఫైబర్ మరియు విటమిన్లతో నిండే ఉంటాయి. కాబట్టి వారంలో రెండు రోజులైనా తీసుకోవడం మంచిది.

మనకు  ఇప్పుడు ఎక్కువ దొరికే బొప్పైలో అలాగే నారింజ వంటి పండ్లలో పొటాషియం. మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

సాల్మన్ చెపలు మన గుండె చాలా మంచి ఆహారం కానీ ఇవి మనకు దొరకవు ఈ చెపలో విటమిన్ A, విటమిన్  B,  పుష్కలంగా ఉంటాయి.మంచి కొవ్వులును కలిగి ఉంటాయి.


గ్రీన్ టీ కూడా మన  గుండెకు పనితీరును మెరుగుపరుస్తుంది.రోజుకు రెండు సార్లు  అయినా తీసుకుంటే మంచిది.

పుచ్చకాయలో  ఉండె నైట్ట్రీక్ ఆక్సైడ్ గుండె రక్తనాళాలును ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండె పొటాషియం రక్త పొటును నియంత్రిస్తుంది.

పాలకూర ఇందులో ఫోలిక్ ఆసిడ్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ కూర ఎక్కువగా తినడం వలన కండరాలు బలిష్టంగా  చెస్తుంది. అలాగే రక్తపోటును తగ్గిస్తుంది.



                                                                             నలుగురికి షేర్ చెయండి.

No comments:

Post a Comment