చలికాలంలో జలుబు సమస్య నుంచి విముక్తి ఏలా?
శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో ప్రధానంగా జలుబు సమస్య ఏదుర్కొంటుంటారు. ఇందుకు ఏవోవో మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే సామాన్యంగా దొరికే చిన్న చిన్న వాటితో జలుబును తగ్గించుకోవచ్చు. జలుబు తగ్గించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ళ ఉప్పును కలపాలి. ఇది నమిలి మింగాలి. తులసి టీ తాగినా కూడా జలుబును తగ్గించుకోవచ్చు.
వేడిపాలల్లో చిటికెడు పసుపును వేసికుని రాత్రి పడుకొనే ముందు తాగితే ఉపయోగం. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్కను , దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో వాడగట్టి దీనికి కొద్దిగా తేనెను కలిపి త్రాగితే మంచిది. ప్రతి రోజు నీటిని బాగా మరగబెటి చల్లార్చి తాగలే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టండి . ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నపుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏడు-ఎనిమిది మిరియాలు నెయ్యలో వెంచుకుని తినాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాది నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది. తమలపాకులు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి.
చిట్కా :
తులసిని ఉదయానే కాలి కడుపునే తీసుకోవడం చాలా మంచిది.
No comments:
Post a Comment